పసిబిడ్డల ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదు- పోప్

జోసెఫ్ అవినాష్
04 Feb 2025
బాలల హక్కులపై జరిగిన మొదటి అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశంలో పోప్ ఫ్రాన్సిస్ మాట్లాడుతూ,యుద్ధం,పేదరికం మరియు వలసలతో బాధపడుతున్న పిల్లల ఆర్తనాధాలను వినమని ప్రపంచ నాయకులను కోరారు."పిల్లల ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదని" వారిని ప్రేమించాలని ,అబార్షన్ సంస్కృతిని విడిచిపెట్టాలని ,దేవుడు ఇటువంటివి ఇష్టపడరని ఆయన కోరారు.ప్రపంచ పురోగతి ఉన్నప్పటికీ, చాలా మంది పిల్లలు ఇప్పటికీ పేదరికం, సరైన విద్య లేకపోవడం, అన్యాయం మరియు దోపిడీకి గురవుతున్నారని నొక్కి చెప్పారు. పసిబిడ్డల కోసం ప్రార్థించాలని, వారి అభివృద్ధికి బంగారు బాటలు వేయాలని ఆయన అంతర్జాతీయ సమాజాన్ని కోరారు.