యేసుతో కలసి ముందుకు సాగుదాం

జోసెఫ్ అవినాష్
03 Feb 2025
సామాన్య 4వ మంగళవారం
మార్కు 5:21-43
యాయీరు కుమార్తె అనారోగ్యంతో బాధపడుతూ మంచం పట్టి ఉన్నది.యాయీరు పాలకుడైనప్పటికీ యేసునందు చాలా చాల గొప్ప విశ్వాసమును ప్రదర్శించాడు.అదేమిటంటే, యేసుప్రభువు తన కుమార్తెను తాకితే తప్పనిసరిగా ఆమెకు సంపూర్ణ ఆరోగ్యం మరలా వస్తుందని నిండు నమ్మకం.నమ్మకమే కాదు,తన ప్రయత్నం కూడా చాలా మెచ్చుకోదగినది.అది ఏమిటంటే, విశ్వాసానికి తన ప్రయత్నం తాను చేసాడు. యేసు చెంతకు వెళ్ళి యేసుని బ్రతిమాలాడారు.మార్కు 5:36 ప్రకారం "నీవు అదైర్యపడవద్దు,విశ్వాసం కలిగియుండు" అని ప్రభువు యాయీరు విశ్వాసాన్ని బలపరిచాడు.యేసు యాయీరు కుమార్తెను అద్భుత రీతిగా బ్రతికించాడు.
రెండవ విశ్వాస ప్రకటన రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్న స్త్రీ తన విశ్వాసాన్ని లోపల ఉంచుకొని ప్రయత్నం చేసింది.ఎవరు నన్ను ఏమి అనుకున్నా పర్వాలేదు, యేసు మాత్రమే సంపూర్ణ స్వస్థత ఇస్తాడు అనే నమ్మకంతో ప్రయత్నించింది.ప్రయత్నం ఫలించింది. అందుకే అన్నారు పెద్దలు “సాధనమున పనులు సమకూరు ధరలోన” అని. మన విశ్వాసం, మన ప్రయత్నం రెండు కలిగి జీవితాన్ని యేసుతో కలసి ముందుకు సాగుదాం.