ఈనాటి సువిశేష సారాంశము,పద్యరూపంలో
శ్రీమతి బి. మేరీ సుశీల
29 Oct 2024
తేది.30-10-2024 బుధవారం
లూక13:22-36
ఈనాటిసువిశేషసారాంశము(పద్యరూపంలో)
--------------------------------
తేగీ
ఇరుకు మార్గాన ప్రావేశ మరయు వారు!
రక్షణకు పాత్రులగుదురు రయము గాను!
అందరి కదిసాధ్యము కాదు కొంతమందె!
వెళ్ళతగుదురు యజమాని తలుపు తీయ!
తేగీ
తలుపు మూయగ యజమాని వెలుపటననె!
నిలచి తట్టుచు నుందురు తలుపు తీయ!
మిమ్ము నెరుగను నేనను తామసమున!
కలిసి తిన్నాము తిరిగాము తలుపు తెరువు!
అనుచుచెప్పనారంబింతు రతనితోను!
తేగీ.
దుష్టులారా తొలగి పొండు దూరమునకు!
ఇతరు లబ్రహాము, యాకోబు తదితరులును!
పరము నందుండ మీరేడ్చి పండ్లు కొరకు!
నిత్య నరకాన నుందురు నిక్కవముగ !
తేగీ
దిక్కులన్నింటి నుండియు దేవరాజ్య!
ముననుకూర్చుండునప్పుడు కనుదు మీరు!
మొదటి వారగు కడపట మొత్తుకొనుచు!
చివరి వారగుమొదటిగ
చింతలేక!