విశ్వాసముతో క్రీస్తు వైపు తిరగండి- పోప్
వాటికన్ వార్తా విభాగం
28 Oct 2024
క్రీస్తు యొక్క దయగల ప్రేమ మన జీవితాలను మార్చగలదని, మనకు దిశను అందించగలదని మరియు మనల్ని సంతోషపెట్టగలదని ఆదివారం సందర్భంగా నిన్నటి రోజున వాటికన్ వేదికగా తాను అందించిన సువిశేష సందేశంలో పోప్ పై వ్యాఖ్యలు చేశారు.బార్టిమేయస్‌ను అను గ్రుడ్డివాడని క్రీస్తుప్రభువు స్వస్థపరిచిన వృత్తాంతాన్ని మనం నేటి సువార్తలో ధ్యానిస్తున్నాం. గ్రుడ్డివాడు తన విశ్వాసం ద్వారా చూపును పొందాడని, ప్రభుని స్వరాన్ని తన చెవులతో ఆలకించాడని మనం కూడా ప్రభువును నిండు మనసుతో, పరిపూర్ణ విశ్వాసంతో అనుసరించాలని తద్వారా మన జీవితాల్లో కూడా ఎన్నో వెలుగులు చూడవచ్చని ఆయన అన్నారు.