ఈనాటి సువిశేష సారాంశం, పద్య రూపంలో
శ్రీమతి బి. మేరీ సుశీల
27 Oct 2024
తేగీ.
కొండ ఎక్కి ఏకాంతాన వేడుకలర!
రాతిరంతయు ప్రార్థన
యందు గడిపి!
అరుణుడుదయించ శిష్యుల చేరబిల్చి!
అందు పన్నెండు మంది నపోస్తులనియె!
తేగీ.
పేతురు రనబడు సీమోను పెద్దవాడు!
ఆంద్రి, యోహాను,యాకోబు ,భర్తొలోమి
అల్ఫయి కుమార్డ్ యాకోబు, ఫిలిపు,తోమ!
యూద ఇస్కారియోతు
జలోతె ,యూద,!
మత్త యనువాడు వీచిత్ర మనగ జెల్లు!