ఈనాటి సువిశేష సారాంశం, పద్య రూపంలో
శ్రీమతి బి. మేరీ సుశీల
01 Oct 2024
తేగీ.
యేసు శిష్యులు తనయొద్ద
కేగుదెంచి;
పరమ రాజ్యాన యెవరు
గొప్పంచు నడుగ!
యేసు ఒకబాలు తనచెంత చేర్చుకొనుచు;
మీరు పరివర్తనము చెంది
మేదినందు!
తేగీ.
చిన్నబిడ్డల వలెనున్న
పన్ను గాను!
పరమరాజ్యప్రవేశము
దొరుకునిజము!
తనను తగ్గించుకొనినచొ
తనకుతాను;
గొప్ప వాడగు నిక్కము ఒప్పిదమన!
తేగీ
చిన్న బిడ్డల నా పేర
చే ర్చు కొనిన,
నన్ను అంగీకరించిన చందమగును!
చిన్న బిడ్డల నాపకు డెన్న డయిన!
వీరి దూతలు పరమున
తండ్రి చెంత,
నిలిచి యుందురు హాయిగా నిశ్చయమ్ము!