ఈనాటి సువిశేష సారాంశం ,పద్యరూపంలో
శ్రీమతి బి. మేరీ సుశీల
01 Oct 2024
తేగీ
పరమునకుబోవుసయంపు
దరినయేసు;
యెరుషలేముకుబోవగా
యెరుకపరచ!
సమరియాగ్రామమున
బస నమరజేయ!
దూతలనుబంప
నచటికి ముందుగానె!
తేగీ.
యెరుషలేముకు వెళ్ళె డి
గురుని కొరకు;
సిధ్ధమొనరింపవెరచిన
చోద్యప్రజను;
శిష్యులే కోబు యోహాను
శిఖలుబంపి;
నాశనముజేయగోర గధ్ధించె యేసు!
వేరుగ్రామానికెళ్ళరి వారలంత!