వరద బాధితుల సేవలో విజయవాడ మఠకన్యలు
జోసెఫ్ అవినాష్
05 Sep 2024
"నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించు" అన్న క్రీస్తు మాటలను ఆచరణలో పెట్టి, విజయవాడ పరిసర ప్రాంతాలలో అకాల వర్షాలు, వరదల వల్ల సర్వం కోల్పోయిన బాధితులకు సహాయ, సహకారాలు అందించడానికి వివిధ మఠ సభలకు చెందిన విజయవాడ సిస్టర్స్ ముందుకొచ్చి శభాష్ అనిపించారు.వరద నీటిని కూడా లెక్కచేయకుండా బాధితులకు ఆహారపు పొట్లాలు,మంచినీరు,పాలు, నిత్యవసర వస్తువులు సాయం చేశారు.వరద నీటిని కూడా లెక్కచేయకుండా మంచి మనసుతో సేవ చేస్తున్న సిస్టర్స్ ను ఉభయ తెలుగు రాష్ట్రాల కతోలికులు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశంసిస్తున్నారు.