ఈనాటి సువిశేష సారాంశం ,పద్యరూపంలో
శ్రీమతి .మేరీ సుశీలా దేవి
04 Sep 2024
తేగీ
సరసు గెన్నేసరేత్తను
తీరమందు!
జాలరులు వలలు కడుగు
జాడజూచి;
జనులు తీరాన సీమోను
దోనెలోన!
యేసుకూర్చుండిబోధించగాసువార్త!
తేగీ.
ఒడ్డునుండిలోనికినెట్టు
;నట్లు పలికె!
వలనువేయుడి చేపలు
వలయునట్లు! పడవనింకను లోతుకు
నెట్ట మనెను!
రాత్రియంతయు శ్రమపడ
దొరకలేదు!
తేగీ.
అయిన నీమాట చొప్పున
వేయతగును!
అనుచు వలలను విసరిరి అద్భుతముగ;
వలలుపిగులగ చేపలు
చాలపడెను!
రెండుపడవలు నింపిరి
మెండు గాను!
తేగీ.
పేతు రదిజూచి యేసుని
పాదములను;
పట్టి ప్రభవా! క్షమించుము
పాపినంచు;
నన్నువిడిచిపొమ్మనుచును
విన్నవించె!
తేగీ.
యేసు-- జంకకు సీమోను
యింకనుండి;
మనుషులను పట్టు వాడవై
ఘనత నొందు!
జాలరులుకొంద రావలల్
జారవిడిచి;
యేసు ననుసరించిరివారు
యెలమి యందు!