గురు పూజోత్సవ వేళ
కొండవీటి అంతయ్య, సత్తెనపల్లి
04 Sep 2024
ఆదిగురువులు అమ్మ నాన్నలు
మొదట నేర్పిరి ఓనమాలు పిదప,
బడిలో పంతులయ్యలు చదువు చెప్పిరి
చక్క దిద్దిరి మదిని తల్చెద వారి
కొల్చెద గురువులందరి పూజ సల్పెద!
ఆటపాటల తీరులోనే పాఠముల
బోధించువారు , చైతన్య జ్వాలలు
రగులుకొలిపి చిత్తమందున నిలుచువారు , కొట్టువారు,తిట్టువారు, జోరుగా బోర్
కొట్టువారు, జోకుతూ జోకొట్టు
వారు ఎవరినీ మరి మరువలేము
ఒకరిదొక స్మైల్ ! ఒకరిదొక స్టైల్!
ఎందరెందరొ గురువుగారలు
అందరికి శుభ వందనములు!