సేవకు చిరుదీపం-ప్రభుని ప్రతిరూపం
పి.నిర్మలరాజు
04 Sep 2024
నీవు అందరిలాగే జన్మించావు
అందరిలాగే మరణించావు
చావుపుట్టుకల ఆరాటంలో,
అందరూ ఒకటే అని నిరూపించావు.
జన్మనుండిమరణానికి సాగే యానంలో
కొత్తదనాన్ని చూపించావు కరుణను
కురిపించావు ప్రేమను పండించావు
మానవతకు అర్థం మనిషికి పరమార్ధం
స్వార్ధం కాదన్నావు
త్యాగ మేనని నిరూపించావు.
నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించు
అన్న ప్రభుని ప్రేమ సందేశాన్ని
ఆచరణాత్మకంగా మలిచావు
అజరామరం అని నిరూపించావు
యుగయుగాల మానవాలికి
నవ జగానా బాట వేశావు
అనుసరణీయమని తెలిపావు
అమృతత్వాన్ని పొందావు
విశ్వ మానవాళి గుండె చప్పుడు
అయ్యావు. ఓ బహుదూరపు
బాటసారి ఏమని తలచెదనిన్ను?
ఎవరని పిలిచేది నిన్ను?
ప్రార్ధన చేసే పెదవుల కన్నా
సాయం చేసే చేతులే మిన్న
అంటూ, సేవా మయ జీవితాన్ని
ప్రభు నికి అంకితం చేసి అమరత్వాన్ని
సాధించిన ఓ జననీ ! మా విశ్వజనని!!
విశ్వమంతా విపత్కర పరిస్థితులతో
నిండి ఉన్న వేళ కరుణ కాంతిని
ప్రసాదించమని వేడు కొనుమ తల్లి విభుని.