ప్రమాదవశాత్తు నదిలో పడి, గురు విద్యార్థి మృతి
Matters india
04 Sep 2024
ముంబైలో దారుణం చోటుచేసుకుంది. మంచి గురువు కావాలని లక్ష్యంతో తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి సెమినరీలో చేరిన గురు విద్యార్థి బ్రదర్ నోయెల్ ఫెలిక్స్(29) సెప్టెంబర్ 2న ప్రమాదవశాత్తు నదిలో పడి ప్రాణాలు విడిచాడు.పోలీసులు మరియు అగ్నిమాపక శాఖ రెండు గంటల విస్తృత శోధన తర్వాత బ్రదర్ మృతదేహాన్ని వెలికితీశారు.. బ్రదర్ మరణ వార్త విని కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. బ్రదర్ అందరితో కలివిడిగా ఉండే వారిని, ఇలా మరణించడం బాధను కలిగించిందని, తోటి గురు విద్యార్థులు వాపోయారు.