ఈనాటి సువిశేష సారాంశము( పద్యరూపంలో)
శ్రీమతి .మేరీ సుశీలా దేవి
03 Sep 2024
తేగీ.
యేసు సీమోను ఇంటికి
వచ్చినపుడు!
జ్వరము వలననె తనయత్త నీరసించె!
జ్వరము జారెను గద్దించ
జవము పొంది;
లేచి పరిచర్యలనుజేసి
ప్రస్తుతించె!
యేసు పలుకుల లో శక్తి
నెన్నతరమె!
తేగీ
రోగు లెందరినో ప్రభుబాగు
జేసె!
ప్రభుని గుర్తించి దయ్యముల్ పారిపోయె!
దేవ రాజ్య సువార్తను
తెలియజేయ!
యూదయాదేశ మందంత
బోధ జేసె!