నేటి సువిశేష సారాంశము (పద్యరూపంలో)
శ్రీమతి .మేరీ సుశీలా దేవి
02 Sep 2024
తేగీ
యేసుకప్పెర్నహూములో
చేసినట్టి;
బోధలలరారె నధికారపూర్వకముగ!
జనములందరునాశ్చర్య
చకితులైరి!
దెయ్యములుగూడ ప్రభు
శక్తి తెలిసికొనెను!
తేగీ.
దెయ్యమావరించిన వాడు
తెలివి గలిగి
నజరయుడవైనయేసు!మానాశనమును;
కోరివచ్చితివన్నట్లు
ఎరుక గలదు!
దేవ కుమరుడ నీవని
తెలియబలికె!
తేగీ.
ఊరకుండుము,పొమ్మని
వురిమిచూడ;
హానిచేయక తాబోయె
వానివదలి!
పారిపోయిన దుష్టాత్మ
తీరు జూచి!
ప్రభుని యధికార బోధను
ప్రజలుపొగడె!