ఈనాటి సువిశేష సారాంశం (పద్య రూపంలో)

శ్రీమతి .మేరీ సుశీలా దేవి

01 Sep 2024

తేగీ.
వాడుకగ నజరేతు గుడిన
నిలచి!
జనులు కూడగ యేసు విశ్రాంతిదినము;
పఠన సమయాన చదివిన
పాఠమరయ!
యెషయ గ్రంధము నందున్న విషయమిదియె!

తేగీ.
పేదలకుసువార్తయు
చూపుఅంధులకును,
అలసిన ప్రజలకు చెరలో
నలుగువార్కి ;
ప్రకటనముచేయవిడుదల
ప్రభువు నాత్మ!
క్రీస్తు గాపంపె నన్నని
యేసుపలికె!

తేగీ.
అందుకాశ్చర్యమున జూడ
నాక్షణమున;
మీవినికిడిలోనెరవేరె
నవని యందు!
వైద్యుడా నిన్ను నీవె
కాపాడుకొనుము
అన్నమాదిరి నున్నదీ
విన్నమాట!

తేగీ.
మిన్న కాలేదుప్రావక్త
తననగరున;
యిశ్రయేలున విధవ
రాండ్రెందరున్న;
యేలి యాసారెపతునకే
వెళ్ళలేదె?
కుష్టు రోగులు యెందరో
కుములుచున్న;
ఎలిష నయమానుకేశుధ్ధి
యెటులజేసె!
దైవనిర్ణయమెప్పుడు
తప్పి పోదు!
అనుచు పలుకగా నటనున్న జనులు రేగి;
చంపజూచిరి -- సాధ్యమే
జనులవలన!

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN